పాలకూరతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. వివిధ ఆరోగ్య ప్రయోజనాలకోసం దీనిని డైట్​లో తీసుకోవచ్చు.

అయితే పాలకూరను కొందరు ఇష్టంగా తినరు. అలాంటివారు పాలకూరతో ఈ టేస్టీ రెసిపీలు చేయొచ్చు.

పాలకూరతో చపాతీలు. పాలకూరను పేస్ట్​గా చేసి.. దానిని చపాతీ పిండిలో కలిపి వీటిని చేసుకోవచ్చు.

పాలకూరను హెల్తీగా చేసుకోవాలనుకుంటే చనాతో కలిపి ఇలా గ్రేవీగా చేసుకోవచ్చు. డైట్​ చేసేవారికి బెస్ట్ ఆప్షన్.

ది ఫేమస్ పాలకూర పప్పు. ఇది చాలామందికి ఫేవరెట్ డిష్ కూడా. నాన్​వెజ్ తినేవాళ్లు కూడా దీనిని ఇష్టంగా తింటారు.

పాలకూర పకోడి ట్రై చేస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

కేవలం పాలకూర ఆకులను కాస్త కొబ్బరి తురుముతో కలిపి ఫ్రైగా చేసుకోవచ్చు.

పాలకూర ఆకులను ఉడికించుకుని.. దానిని లంచ్​ టైమ్​లో వెజిటెబుల్స్​తో పాటు కలిపి తినొచ్చు.

పాలకూరను సూప్​లలో లేదా.. రసంగా పెట్టుకుని కూడా కొందరు తింటారు.

మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ పాలకూరను మీ రొటీన్​లో టేస్టీగా చేర్చేసుకోండి.