బ్లాక్ బీన్స్ లో ప్రొటీన్లు, ఫైబర్, మరికొన్ని ఆవశ్యక పోషకాలు పుష్కలం. బ్లాక్ బీన్స్ గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. రక్తంలో చక్కెరను కూడా అదుపు చేస్తాయి. నల్లని వెల్లుల్లిలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బ్లాక్ గార్లిక్ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. బ్లాక్ బెర్రీస్ లో విటమిన్లు C, K ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇమ్యూనిటి మెరుగవుతుంది. బ్లాక్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. యాంటీ క్యాన్సర్ కారకాలు కూడా ఉంటాయి. నల్ల నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, మినరల్స్, కాల్షియం ఇంకా చాలా పోషకాలుంటాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.