బ్లాక్​ సీడ్​ నూనెతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

దీనిని ఎన్నో ఏళ్లుగా ట్రెడీషనల్ మెడిసన్​లో ఉపయోగిస్తున్నారు.

నల్ల జీలకర్ర నూనెను రెగ్యులర్​గా ఉపయోగిస్తే వివిధ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.

ఈ నూనెను రోజుకు 1 లేదా 2 టీస్పూన్లు తీసుకుంటే కలిగే లాభాలేంటో చూసేద్దాం.

దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేస్తాయి.

నూనెలోని థైమోక్వినోన్​ వాయుమార్గాల్లో వాపును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

కండరాలు పట్టేయడం, ఉబ్బసం వంటి వాటిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజుకు 2 గ్రాములు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

రక్తపోటును తగ్గించడంలో కూడా ఈ నూనె మంచి ఫలితాలు ఇస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి.

ఇది రక్తపోటును, అదనపు కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.