బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతి రోజూ తాగితే దుష్ప్రభవాలు ముఖ్యంగా చర్మం మీద ఉంటుంది.

కాఫీ డైయూరెటిక్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. అందువల్ల చర్మం పొడిబారి పోతుంది.

కెఫిన్ వల్ల శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది చర్మ కణాలు దెబ్బతింటాయి.

చర్మం మీద ఏజింగ్ ప్రక్రియను నెమ్మదింపజేయడానికి కొల్లాజెన్ చాలా అవసరం. కెఫెన్ కొల్లాజెన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది.

కెఫిన్ నిద్ర మీద కూడా ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల క్రమంగా కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడుతాయి.

నిద్ర లేమి ప్రభావం చర్మం మీద క్రమంగా కనిపిస్తాయి. అలసట వల్ల త్వరగా ఏజింగ్ అవుతుంది.

బ్లాక్ కాఫీ ఆమ్ల గుణం కలిగి ఉంటుంది. ఇది చర్మంలో ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుంది. ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు ముదురుతాయి.

Image Source: Pexels

ఈ సమాచారం రకరకాల జర్నల్స్ నుంచి నిపుణుల సలహాల నుంచి సేకరించినది. చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.