కళ్లు మసకగా కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త! గంటల కొద్దీ స్క్రీన్ టైమ్ పెరిగిన నేపథ్యంలో చిన్న వయసులోనే కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలంటున్నారు నిపుణులు. 30 ఏండ్లు నిండిన వాళ్లు తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. కాటరాక్ట్, గ్లకోమా లాంటి సమస్యలను తొలి దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా కంటి సమస్యలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. కంటి ఆరోగ్యం కోసం ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. కంటి ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ధూమపానాన్ని మానుకోవాలి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabaya.com