పుచ్చకాయను చాలామంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సమ్మర్​లో వీటిని ఎక్కువగా తింటారు.

సమ్మర్​లో హైడ్రేషన్ కోసం, ఆరోగ్యం కోసం దీనిని డైట్​లో చేర్చుకునేవారు కూడా ఎక్కువే.

అయితే ఈ పుచ్చకాయను ఏ టైమ్​లో తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

సమ్మర్​లో శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచడంలో పుచ్చకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు.

పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ఇది ఆకలిని తీర్చడంతో పాటు హైడ్రేషన్​ని అందిస్తుంది.

అయితే పుచ్చకాయ తినడానికి ఏ టైమ్ మంచిదో తెలుసా?

పుచ్చకాయను ఉదయం తినాలనుకుంటే 10 నుంచి 12 గంటల మధ్య తినొచ్చట.

సాయంత్రం 5 గంటలలోపు కూడా తినొచ్చు. స్నాక్స్​గా తీసుకోవచ్చు.

పుచ్చకాయను తిన్న తర్వాత కొంతసేపు ఏమి తినకపోవడమే మంచిది.

ఈ సమయంలో తినడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.