ఖర్జూరం తినడానికి ఏది సరైన సమయం?

Published by: Geddam Vijaya Madhuri

ఖర్జూరం ఉదయం పరగడుపున, మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత స్వీట్ గా లేదా రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖర్జూరం తినడానికి ఉత్తమ సమయం ఉదయాన్నే నిద్ర లేవగానే 'ఖాళీ కడుపుతో' తీసుకోవడమే.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా అలసట ఉండదు.

అందులో ఉండే ఫైబర్, సహజ చక్కెర జీర్ణవ్యవస్థను మెరుగుపరచి మిమ్మల్ని ఎక్కువ కాలం శక్తివంతంగా ఉంచుతుంది.

బరువు పెరగాలని (Weight Gain) అనుకునేవారు రాత్రి పడుకునే ముందు నెయ్యితో ఖర్జూరం తినాలి.

శారీరక బలహీనత, అలసటను తొలగించి స్టామినా పెంచడానికి ఖర్జూరాలను పాలలో ఉంచి మరిగించి తాగడం ఉత్తమం.

రోజువారీ ఆహారంలో ఖర్జూరాలను స్మూతీలు లేదా మిల్క్‌షేక్‌లలో కలిపి తీసుకోవడం వల్ల రుచి, పోషణ రెండూ పెరుగుతాయి.

ఖర్జూరంలో ఉండే కాల్షియం, మినరల్స్ కీళ్ల నొప్పులను నయం చేసి ఎముకలను లోపలి నుంచి బలంగా చేస్తాయి.

క్రమం తప్పకుండా సరైన మోతాదులో ఖర్జూరం తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. చర్మం చాలా మృదువుగా, మెరిసేలా మారుతుంది.