ఖాళీ కడుపుతో ఏ ఫుడ్స్ తింటే మంచిదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

ఉదయం నిద్రలేవగానే ఆకలివేస్తుంది. కానీ ఆ సమయంలో అన్నీ తినకూడదు.

మరి ఖాళీ కడుపుతో ఏమి తినాలి? ఏవి తింటే మంచిది?

మొదట గోరువెచ్చని నీరు తాగండి. దీనివల్ల శరీరం నుంచి టాక్సిన్లు బయటకి పోతాయి.

రాత్రి సమయంలో బాదం నానబెట్టుకుని ఉదయాన్నే తినండి.

ఆపిల్, బొప్పాయి, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తినవచ్చు.

వేడి నీటిలో తేనె కలిపి తాగితే మంచిది.

ఓట్మీల్ తో డ్రైఫ్రూట్స్ కలిపి తినవచ్చు.

ఉడికించిన గుడ్డు ఖాళీ కడుపుతో తినేందుకు అనువైనవి. ప్రోటీన్ అందుతుంది.

పెరుగుతో స్ట్రాబెర్రీ, బాదం తినొచ్చు. పెరుగుకు బదులు యోగర్ట్ తీసుకోవచ్చు.

అరటిపండు తిన్న వెంటనే శక్తి వస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.

నానబెట్టిన చియా సీడ్స్ తినవచ్చు. కానీ వైద్యుల సలహా తీసుకోండి.