బరువు తగ్గేందుకు జిమ్, డైట్ సరిపోదు.. అవి కూడా ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri

బరువు తగ్గడానికి తక్కువ తినడం లేదా వ్యాయామం మాత్రమే కాదు కొన్ని నియమాలు పాటించాలి.

తక్కువ తినడం కాదు.. గడియారం చూసి తినాలి. భోజన సమయాలు కచ్చితంగా ఫాలో అవ్వాలి.

ప్రతిరోజు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేస్తే మంచిది. లేకపోతే కనీసం నడవండి.

బరువు తగ్గడానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. రోజంతా 4 లీటర్ల నీరు తాగితే మంచిది.

శరీరాన్ని ఎంత హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే బరువు తగ్గడం అంత సులభం అవుతుంది. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగండి.

బరువు తగ్గడానికి తగినంత నిద్ర చాలా అవసరం రోజుకు 8 గంటలు నిద్రించడానికి ప్రయత్నించండి.

అసమగ్ర నిద్ర, తక్కువ నీరు తీసుకోవడం వల్ల బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

ఆహార జాబితా నుంచి నూనె పదార్థాలు, చక్కెర, మైదాను పూర్తిగా తొలగించండి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

రోజంతా కొద్ది కొద్దిగా, కానీ తరచుగా తినండి. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది.