ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే దీనిని నేరుగా తీసుకోలేని వాళ్లు పొడిరూపంలో తీసుకోవచ్చు.

ఖాళీ కడుపుతో ఈ పొడిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో మంచి ఫలితాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఆమ్లా పౌడర్ జీర్ణ ఎంజైమ్​లను ప్రేరేపించి జీర్ణక్రియను పెంచుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

ఆమ్లా పౌడర్​లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచడంలో హెల్ప్ చేస్తుంది.

శరీరం నుంచి టాక్సిన్లను దూరం చేసి.. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇన్​ఫెక్షన్లు దూరం చేస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసి.. మెటబాలీజం పెంచి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు స్కిన్ హెల్త్, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

రోజుకు 1 లేదా 2 టీస్పూన్ల ఉసిరి పొడిని వేడి నీళ్లల్లో కలిపి తాగవచ్చు.

బ్రేక్​ఫాస్ట్​కి ముందు ఖాళీ కడుపుతో తాగితే మంచిది. తినడానికి కనీసం అరగంట ముందు తీసుకుంటే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.