వాల్‌నట్స్‌ను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా మంచిదట.
ముఖ్యంగా వీటిని పిల్లలకు అందిస్తే అనేక ప్రయోజనాలు అందుతాయి. కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇవి బెనిఫిట్స్ ఇస్తాయి.
వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జుట్టు, చర్మానికి మంచి ప్రయోజనాలు అందుతాయి.
వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్‌కి మంచిది. మలబద్ధకం తగ్గుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జింక్ కూడా ఉంటుంది. ఇవి ఇమ్యునిటీని పెంచుతాయి.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.
వాల్‌నట్స్‌లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడును చురుకుగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
కడుపు నిండుగా ఉంచి.. అన్‌హెల్తీ స్నాక్స్ నుంచి దూరంగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి.
అయితే వాల్నట్స్ ఆరోగ్యానికే మంచిదే కానీ రోజుకు ఒకటి తింటే సరిపోతుంది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.