మగవారు రోజు బొప్పాయి తింటే కలిగే లాభాలివే
బొప్పాయిలోని వివిధ పోషకాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే ఆడవారితో పాటు మగవారు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
దీనిలో విటిమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచి.. ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తుంది.
బొప్పాయిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మంటను తగ్గించి మొత్తం ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి.
విటమిన్ ఏ, బెటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. వయసుతో పెరిగే కంటి లోపాలను తగ్గిస్తాయి.
మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలను బొప్పాయి తగ్గిస్తుంది. స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది.
బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కొన్ని రకాల క్యాన్సర్లను దూరం చేస్తాయి.
రోజూ బొప్పాయి తినడం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. దీనిలోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది.
హెల్తీ స్కిన్‌ని ప్రమోట్ చేసి.. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.