తేనెను ముఖానికి అప్లై చేస్తే ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ పొందవచ్చు.

తేనెలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు పింపుల్స్​ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

ముఖం పొడిబారకుండా మాయిశ్చరైజ్​ చేస్తాయి. హైడ్రేషన్​ని అందించి పొడిబారకుండా చూస్తుంది.

తేనెలోని యాంటీఏజింగ్ లక్షణాలు వృద్ధాప్యఛాయలను దూరం చేసి ముడతలను తగ్గిస్తాయి.

ఎండవల్ల కమిలిపోయిన చర్మానికి రిలీఫ్​ని ఇవ్వడంలో తేనెలోని యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పనిచేస్తాయి.

చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేసి ముఖానికి మెరుపు, నిగారింపును అందిస్తుంది.

తేనెను ముఖానికి లేయర్​గా అప్లై చేసి.. పావుగంట నుంచి అరగంట ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

తేనెలో పెరుగు, ఓట్​మీల్, అవకాడో వంటివాటిని కలిపి మాస్క్​గా ఫేస్​కి వేసుకోవచ్చు.

తేనెను నేరుగా పింపుల్స్​పై అప్లై చేయడం వల్ల ఆ ప్రాంతంలో యాక్నే పెరగకుండా ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. బ్యూటీ నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.