మూంగ్ దాల్ కిచిడి బెనిఫిట్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest/dassanasvegrecipes

పోషకాలు అధికంగా ఆహారం

పెసరపప్పు కిచిడి తేలికగా జీర్ణమవుతుంది. ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. హెల్తీ ఫుడ్ తీసుకునేవారికి ఇది చాలా మంచిది.

Image Source: Pinterest/pipingpotcurry

మంచి ఫలితాలు

ఒక నెల పాటు ప్రతిరోజూ మూంగ్ దాల్ కిచిడి తింటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే దాని ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

Image Source: Pinterest/priyai

నెలరోజులు తింటే..

ఒక నెల పాటు మూంగ్ దాల్ కిచిడి తినడం వల్ల జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు మీ శరీరంపై సానుకూల ప్రభావం ఉంటుందట.

Image Source: Pinterest/cookwithsmile

మెరుగైన జీర్ణక్రియ

పెసరపప్పు కిచిడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. దీనిలోని పీచు పదార్థం పేగు కదలికలకు సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం రాకుండా నివారిస్తుంది.

Image Source: Pinterest/shwetaindkitchn

బరువును నియంత్రణకై

ఈ వంటకాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు నిర్వహణకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజంతా శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచుతుంది.

Image Source: Pinterest/greenbowl2soul

విటమిన్స్, మినరల్స్

పెసర పప్పులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మంటను తగ్గిస్తాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

Image Source: Pinterest/binjalpandya

రక్తపోటును తగ్గించడానికై..

ముంగ్ దాల్​లోని పోషకాలు రక్తపోటు స్థాయిలను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇది మొత్తం గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

Image Source: Pinterest/playfulcooking

షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేందుకు..

ముంగ్ దాల్ కిచిడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవచ్చు. దీనిలోని లో గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కంటెంట్.. షుగర్ కంట్రోల్ చేస్తుంది.

Image Source: Pinterest/sangitaag

పోషక లోపం?

కేవలం కిచిడీని మాత్రమే తీసుకుంటే.. కొన్ని ముఖ్యమైన పోషకాల లోపానికి దారి తీస్తుంది. సమతుల్య పోషణ కోసం వివిధ రకాల ఆహారాలను కూడా రెగ్యులర్​గా తీసుకోవాలి.

Image Source: Pinterest/traveldotearth

మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే..

పెసర పప్పులో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉన్నవారికి హాని కలిగించవచ్చు. భద్రత కోసం మితంగా తీసుకోవడం ముఖ్యం.

Image Source: Pexels