కాకరకాయలో నీళ్లు ఎక్కువ. వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

కాకర తక్కువ క్యాలరీలు కలిగిన కూరగాయ, ఫైబర్ కూడా ఎక్కువ. బరువు పెరగకుండా కడుపు నిండా తినవచ్చు.

కాకరకాయతో చలువ చేస్తుంది. వేసవి వేడి నుంచి కాపాడుతుంది.

కాకరకాయలో రక్తంలో గ్లూకోజ్ తగ్గించే సమ్మేళనాలు కలిగి ఉంటుంది. మధుమేహులకు మేలైన ఆహారం.

చేదుగా ఉండే ఈ కాయగూరలో విటమిన్లు A,C,K తోపాటు మినరల్స్ కూడా ఉంటాయి.

జీర్ణక్రియ మెరుగయ్యేందుకు కాకర దోహదం చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యలను నివారిస్తుంది.

విటమిన్C, ఇతర యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మ ఆరోగ్యం బావుంటుంది. వేసవి యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది.

డీటాక్సిఫికేషన్ లక్షణాలు కలిగిన కాకరకాయతో శరీరంలోని టాక్సిన్లు తొలగి పోతాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే