యాపిల్స్ ఆరోగ్యానికి మంచివి. అయితే వీటిని పీరియడ్స్ సమయంలో తింటే మరిన్ని లాభాలుంటాయట.

యాపిల్​లోని యాంటీఆక్సిడెంట్లు ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి నొప్పిని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయట.

యాపిల్స్​లోని ఫైబర్ రక్తంలో షుగర్​ లెవెల్స్​ని రెగ్యులేట్ చేసి.. మూడ్ స్వింగ్స్​ని తగ్గిస్తుందట.

దీనిలో పోషకాలు పీరియడ్ సమయంలో వచ్చే కడుపు ఉబ్బరాన్ని కంట్రోల్ చేస్తాయి.

జీర్ణ సమస్యలను దూరం చేసి.. పీరియడ్స్ సమయంలో వచ్చే మలబద్ధకాన్ని తగ్గిస్తాయట.

యాపిల్​ని సలాడ్​గా, స్నాక్​గా తీసుకుంటే క్రంచీగా, మంచి రుచినిస్తుంది. ఇది క్రేవింగ్స్​ని తగ్గిస్తుంది.

ఫ్రెష్ యాపిల్స్​ని నేరుగా తీసుకున్నా లేదా జ్యూస్ చేసుకుని తాగిన మంచి ఫలితాలుంటాయి.

యాపిల్ టీ కూడా పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. డ్రై చేసిన యాపిల్ ముక్కలతో టీ పెట్టుకోవచ్చు.

యాపిల్​ని మరీ ఎక్కువగా తింటే.. అంత మంచిది కాదు. కాబట్టి ఒకటి లేదా రెండు తినొచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.