ప్రధాని మోడి చెప్పిన మునగ రసం ఆరోగ్య ప్రయోజనాలివే

మునగ రసంలో ఉండే విటమిన్లు C, A, కాల్షియం, పొటాషియం, ఐరన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మునగ రసంలో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ ఆసిడ్, బీటాకెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులు నివారించబడుతాయి.

మునగ రసం తరచుగా తీసుకుంటే ఇమ్యూనిటి పెరుగుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లను నిరోధించగలిగే శక్తి పెరుగుతుంది.

మునగ రసంలో సహజమైన ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

పేగుల్లో కదలికలు చురుగ్గా ఉండి మలబద్దకం తగ్గుతుంది.

క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటి కూడా పెరుగుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.