రోజూ పడుకునే ముందు ఓ గ్లాసు పాలు తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలుంటాయట. పాలల్లో కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా చేస్తాయి. పాలు రోజూ తీసుకుంటే పెద్దల్లో బోలు ఎముకల వ్యాధి రాకుండా ఉంటుంది. పాలల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కండరాలను బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. దంతాలు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. గమ్స్ ఇబ్బంది లేకుండా హెల్తీగా ఉంచుతాయి. పాలల్లోని అధిక ప్రోటీన్ బరువును తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. అధిక రక్తపోటును కంట్రోల్ చేయడంలో పాలు మంచి ఫలితాలు ఇస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. టైప్ 2 డయాబెటిస్, వివిధ రకాల క్యాన్సర్లను దూరం చేయడంలో పాలల్లోని యాంటీఆక్సిడెంట్లు హెల్ప్ చేస్తాయి. పాలల్లో విటమిన్ ఏ, డి ఉంటుంది. ఇవి హెల్తీ స్కిన్‌ని ప్రమోట్ చేస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.