స్కిప్పింగ్ నెల రోజులు చేస్తే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

కేవలం 15 నిమిషాలు దూకడం ద్వారా 150-200 కేలరీలు సులభంగా ఖర్చు అవుతాయి.

ఆహార నియంత్రణ, ప్రతిరోజు 20-30 నిమిషాల స్కిప్పింగ్ చేస్తే నెలలో 2-4 కిలోల బరువు తగ్గవచ్చు.

అది పొట్ట నడుము తొడలు, చేతుల కొవ్వును వేగంగా కరిగిస్తుంది.

స్కిప్పింగ్ మెటబాలీజంను వేగవంతం చేస్తుంది. తద్వారా బరువు తగ్గడం సులభం అవుతుంది.

అది గుండె, ఊపిరితిత్తులను బలోపేతం చేసి స్టామినాను పెంచుతుంది.

చెమట పట్టడం వల్ల శరీరం నిర్విషీకరణ చెందుతుంది. ముఖం మెరుస్తుంది.

ప్రారంభంలో కేవలం 10 నిమిషాలు మాత్రమే చేయాలి. ఒకేసారి ఎక్కువ చేయకూడదు.

గాయాలు తగలకుండా ఎల్లప్పుడూ స్పోర్ట్స్ షూస్ వేసుకుంటే మంచిది.

మోకాళ్ళ నొప్పులు లేదా నడుము నొప్పి ఉన్నవారు వైద్యుడి సలహా లేకుండా స్కిప్పింగ్ చేయకూడదు.