లవంగాలను నీటిలో మరిగించి దానిలో కాస్త నిమ్మరసం వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదట.

లవంగాల్లో యాంటీఆక్సిడంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్​తో పోరాడి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి.

కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పి రాకుండా చేస్తాయి.

లవంగాల్లోని Eugenol సహజమైన పెయిన్ కిల్లర్​గా పనిచేస్తాయి. ఇవి ఇన్​ఫ్లమేషన్, నొప్పిని తగ్గిస్తాయి.

యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చెడు వాసన రాకుండా, ఇన్​ఫెక్షన్లను దూరం చేసి.. ఓరల్ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి.

బ్లడ్ షుగర్ ఉన్నవారు కూడా దీనిని రెగ్యులర్​గా తీసుకోవచ్చు. ఇన్సులిన్ లెవెల్స్​ కంట్రోల్ చేస్తుంది.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు లివర్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి. ఇన్​ఫ్లమేషన్​ని దూరం చేస్తాయి.

ఎముకల ఆరోగ్యానికి, స్కిన్​ హెల్త్​కి కూడా ఇది మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.