తల్లితో బిడ్డకు నేరుగా సంబంధాన్ని ఏర్పరిచేది నాభి. నాభి గురించి రకరకాల విషయాలు ప్రాచూర్యంలో ఉన్నాయి.

నాభి అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుందట. నాభి మసాజ్‌తో చాలా లాభాలున్నాయట.

నాభి దగ్గర నూనెతో మర్థనా చేస్తే చర్మం పొడి బారడడం తగ్గి చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.

నాభి దగ్గర నూనెతో మర్ధన చేసినపుడు అక్కడి భాగాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా పోషకాలు, ఆక్సిజన్ తగినంత అందుతుంది.

రిలాక్సింగ్ గా ఉండి ఒత్తిడి తగ్గుతుంది. నాభి వద్ద చేసే మసాజ్ ఎండార్ఫిన్స్ విడుదల చేస్తుంది.

నాభి జీర్ణవ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది. అక్కడ నూనెతో మసాజ్ చేస్తే జీర్ణక్రియ కూడా సజావుగా ఉంటుంది.

నాభిని శరీరంలోని శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. ఇక్కడ చేసే మసాజ్ శరీర శక్తిని సంతులన పరుస్తుంది.

Image Source: Pexels and Pixabay

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.