పాలల్లో ఖర్జూరం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు.

ఇవి మీకు తక్షణమే శక్తిని ఇస్తాయట. వీటిలోని సహజమైన షుగర్ ఇన్​స్టాంట్ ఎనర్జీని ఇస్తాయి.

ఎముకల బలానికి మంచిది. వీటిలో మినరల్స్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం బోన్స్​కి మేలు చేస్తాయి.

జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తగ్గుతుంది. గట్ హెల్త్​కి మంచిది.

బీపీని కంట్రోల్​లో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి రక్తపోటుతో ఇబ్బంది పడేవారు హాయిగా తీసుకోవచ్చు.

బరువు పెరగడంలో హెల్ప్ చేస్తుంది. రెండిటీలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు.

కొందరిలో ఈ కాంబినేషన్ అలెర్జీలు ఇస్తుంది. బ్లోటింగ్, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

ఎక్కువమోతాదులో తీసుకుంటే డయేరియా, కడుపు నొప్పి వంటి సమస్యలు రావొచ్చు.

బరువు తగ్గాలనుకునేవారు ఈ కాంబినేషన్ తీసుకోకపోవడమే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.