తమలపాకులతో మొటిమలు మాయం? ఇదిగో ఇలా రాయాలి

ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే.. తప్పకుండా తమళపాకులు ఉండాల్సిందే.

భోజనం తర్వాత కిళ్లీగా తీసుకుంటే.. ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

మరి, తమలపాకులతో అందాన్ని పెంచుకోవచ్చనే సంగతి మీకు తెలుసా?

ఔనండి, తమలపాకులతో ముఖంపై మొటిమలను మాయం చేయొచ్చు.

2, 3 తమలపాకులు, తేనె, చిటెకెడు పసుపు తీసుకుని.. బాగా రుబ్బండి.

అలా మెత్తగా మారిన మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయండి.

కాసేపటి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

ఇలా రోజు విడిచి రోజు చేస్తే.. మొటిమలు మాయం అవుతాయి.

నోట్: ఇవి పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోగలరు.