డెంగ్యూ ఫీవర్ తో జాగ్రత్త- నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం

వర్షాకాలంలో సాధారణంగా సోకే డేంజరస్ వ్యాధి డెంగ్యూ.

దోమల వల్ల డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుంది.

డెంగ్యూ వల్ల తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మం మీద దుద్దుర్లు వస్తాయి.

డెంగ్యూ సోకిన వాళ్లు కనీసం నిలబడలేరు. మంచానికే పరిమితం అవుతారు.

డెంగ్యూ వచ్చిన వారి రక్తంలో ప్లేట్ లెట్స్ భారీగా సంఖ్య పడిపోతుంది.

సాధారణంగా ప్లేట్ లెట్స్ 1.5 నుంచి 4.5 లక్షలు ఉంటే, డెంగ్యూ వచ్చిన వారిలో 1.5 కన్నా తక్కువ ఉంటాయి.

డెంగ్యూ సోకిన వాళ్లు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

డెంగ్యూను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com