కంప్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారా?

ఈ రోజుల్లో చాలా మంది కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చొని వర్క్ చేస్తున్నారు.

శారీరక శ్రమ లేక అంతర్గత అవయవాలు దెబ్బతింటున్నాయి.

అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు నిపుణులు.

ప్రతి రోజూ సుమారు గంట పాటు వాకింగ్ చేయాలంటున్నారు.

వాకింగ్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ కరిగి బరువు అదుపులో ఉంటుంది.

హైబీపీ, గుండె పోటు సహా హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

ఎముకలు, కండరాలను బలోపేతం చేసుకోవచ్చు.

టైప్ 2 డయాబెటిస్ తో పాటు క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com