స్ట్రాబెర్రీస్‌, ద్రాక్ష తినేముందు కాస్త జాగ్రత్త!

సీజ‌న్ ప్రారంభం కావడంతో మార్కెట్లోకి స్ట్రాబెర్రీస్‌, ద్రాక్ష పండ్లు వచ్చేస్తున్నాయి.

చాలా మంది ఈ పండ్లను ఈ సీజన్ లో ఆస్వాదిస్తుంటారు.

అయితే. వీటిని తినే ముందు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పండ్ల‌పై ఉండే ర‌సాయ‌నాలను తొల‌గించేందుకు ఉప్పు నీటిలో 20 నిమిషాలు నానబెట్టాలి.

లేదంటే, వెనిగ‌ర్ వాష్‌, బేకింగ్ సోడా బాత్‌ ద్రావణంలో సుమారు 15 నిమిషాలు ఉంచాలి.

ఆ తర్వాత పొడి గుడ్డతో చక్కగా తుడిచిన తర్వాత తినాలి.

లేదంటే, వీటిపై ఉండే ఫంగ‌స్ లాంటి క్రిములు ఫంగ‌ల్‌, గొంతు ఇన్ఫెక్ష‌న్లకు కారణం అవుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com