నూడుల్స్, మ్యాగీ వంటివాటిని చాలామంది ఇష్టంగా తింటారు. ఈజీగా కుక్ అయిపోవడం కూడా ఓ రీజన్.

అయితే ఈ నూడుల్స్ ఆరోగ్యానికి మంచివి కాదని అందుకే వాటిని తినొద్దని చెప్తారు. అయితే కొన్ని సమస్యలున్నవారు అస్సలు తినకూడదట.

గ్లూటెన్ ఫుడ్ అలెర్జీ ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిది. ఇది ఉదరకుహ వ్యాధిని పెంచుతుంది.

నూడుల్స్​లోని కార్బ్స్, ఫైబర్ కడుపు ఉబ్బరం, గ్యాస్​ని పెంచుతాయి. కడుపు నొప్పిని పెంచుతాయి.

డయాబెటిస్ ఉన్నవారు నూడుల్స్ తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.

ఇన్సులిన్ రెసిస్టెన్సీని ఇబ్బందికి గురిచేయడంతో పాటు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

నూడుల్స్​లో కేలరీలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అన్​హెల్తీ ఫ్యాట్స్ అన్ని కలిసి బరువు పెరిగేలా చేస్తాయి.

మెటబాలిక్ సిండ్రోమ్​ని పెంచి.. గుండె సమస్యలను, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

రెగ్యులర్​గా నూడుల్స్ తింటే సోడియం లెవెల్స్ పెరిగి రక్తపోటు అధికమయ్యే ప్రమాదముంది.

కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫ్యాట్, సోడియం కంటెంట్ కలిసి గుండె జబ్బులను పెంచుతాయి.

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుని డైట్​లో తీసుకుంటే మంచిది.