మందు తాగడానికి గ్లాస్ ఎంత అవసరమో.. దానిలో మంచింగ్​కి స్టఫ్​ అంతే అవసరం.

అయితే మందు తాగేప్పుడు కొన్ని ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దని చెప్తున్నారు నిపుణులు.

ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, డోనట్స్ వంటివి మందుతో కలిపి తీసుకుంటే అవి శరీరంలో టాక్సిన్లుగా మారుతాయట.

ఫ్యాట్ ఎక్కువగా ఉండే మీట్స్, స్టీక్ వంటివాటిని ఆల్కహాల్ తీసుకున్నప్పుడు తినకూడదని చెప్తున్నారు.

స్వీట్ కాక్​టైల్స్, మార్గరైట్స్, స్వీట్ టీ ఇన్​ఫ్యూజ్డ్​ కాక్​టైల్స్ రక్తంలో షుగర్ లెవెల్స్​ని పెంచుతాయి.

మందుతో పాటు కేక్​లు, చాక్లెట్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్ అమాంతం పెరిగిపోతుందట.

సోడియంతో నిండిన చిప్స్, పాప్​కార్న్ వంటివి మందుతోపాటు తీసుకుంటే డీహైడ్రేషన్​కి దారి తీస్తుంది.

కెఫిన్​తో నిండిన ఫుడ్​ ఆల్కహాల్​తో కలిపి తీసుకున్నప్పుడు హార్ట్ రేట్​ పెరిగి.. బీపి ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ.

స్పైసీ ఫుడ్ తీసుకుంటే.. కడుపులో ఇరిటేషన్ వచ్చే అవకాశం, కడుపు నొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

కాబట్టి మందు తాగే సమయంలో ఈ ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.