అశ్వగంధతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో

అశ్వగంధ ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా కాపాడుతుంది. ఆయుర్వేదంలో కూడా దీని గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి.

రోజూ అశ్వగంధ తీసుకుంటే క్యాన్సర్ జబ్బులు రాకుండా ఉంటాయి. నరాల నీరసాన్ని తగ్గిస్తుంది.

ఒత్తిడి ఎదుర్కొనే సామర్థ్యాన్ని అశ్వగంధ మెరుగుపరుస్తుంది. కార్టిసాల్ స్థాయిలను తగ్గించి స్ట్రెస్​ని దూరం చేస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు అశ్వగంధ తీసుకుంటే రక్తంలో చక్కెరను ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని పెంచి.. జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. చుండ్రు, దురద, అలెర్జీని తగ్గిస్తుంది.

స్కిన్​ హెల్త్​కి కూడా ఇది చాలా మంచిది. చర్మానికి హైడ్రేషన్ అందించి.. మృదువుగా చేస్తుంది.

కండరాలకు బలం చేకూర్చుతుంది. వయసు పెరిగే కొద్ది వచ్చే కండరాల సమస్యలను దూరం చేస్తుంది.

థైరాయిడ్ ఉన్నవారు తీసుకోకపోవడమే మంచిది. పిల్లలకు పాలు పట్టేవారు కూడా తీసుకోకూడదు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.