పచ్చి మిర్చితో గుండెకు కొండంత అండ!

ఘాటుగా ఉండే పచ్చి మిర్చితో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.

పచ్చి మిర్చిలో విటమిన్స్, మినరల్స్, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

మిర్చిలోని క్యాప్సైసిన్ కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువు తగ్గేలా చేస్తుంది.

మిర్చిలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు క్యాన్సర్ కారణ కణాలను నిరోధిస్తాయి.

మిర్చిలోని క్లోరోఫిల్, కెరోటినాయిడ్ గుండె సంబంధ వ్యాధులు, టైప్ 2 మధుమేహాన్నినియంత్రిస్తాయి.

మిర్చిలోని ఫైబర్ జీర్ణశక్తిని పెంచి మలబద్ధకం లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

పచ్చి మిర్చిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలు తగ్గించి చర్మకాంతిని పెంచుతాయి.

మిర్చిలోని క్యాప్సైసిన్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది.

All Photos Crdit: Pixabay.com