కాంటాక్ట్ లెన్స్ తో కళ్లకు ముప్పు తప్పదా? ఈ రోజుల్లో కళ్లజోడుకు బదులుగా చాలా మంది కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు. కాంటాక్ట్ లెన్స్ తో చాలా ఇబ్బందులు కలుగుతాయంటున్నారు నిపుణులు. కాంటాక్ట్ లెన్స్ ఎక్కువ సేపు ధరించడం వల్ల కళ్లలో అలెర్జీ సమస్యలు ఏర్పడుతాయి. కాంటాక్ట్ లెన్స్ ఎక్కువగా వాడటం వల్ల కళ్లు ఎర్రబారే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల చూపు మరింత మందగించే అవకాశం ఉంది. కాంటాక్ట్ లెన్స్ కారణంగా కంటి ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్సులు ధరించడం వల్ల కళ్లలో నొప్పి ఏర్పడుతుంది. కాంటాక్ట్ లెన్స్ కారణంగా కంటికి ఆక్సిజన్ సరఫరా జరగక కంటి సమస్యలు ఏర్పడుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: Social Media