ఆపిల్ ఫేస్ ప్యాక్.. Face Glow కోసం ఇలా చేసుకోండి

Published by: Geddam Vijaya Madhuri

సహజమైన మెరుపు కోసం రసాయన ఉత్పత్తులకు బదులుగా ఇంటి నివారణలు సురక్షితమైనవి.

ఆపిల్తో చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి పోషణనివ్వడంతో పాటు రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఆపిల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని బాగుచేస్తుంది. నలుపుదనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆపిల్ ని తురుముకుని.. కొంచెం తేనె కలిపితే ఫేస్ ప్యాక్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచుతుంది. పొడిబారడాన్ని తగ్గిస్తుంది.

ఆపిల్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం రంగు నెమ్మదిగా మెరుగుపడుతుంది.

ఈ ఫేస్ ప్యాక్ వారానికి 2 సార్లు వేసుకోవడం వల్ల చర్మంలో సహజమైన మెరుపు వస్తుంది.

ఈ ప్యాక్ జిడ్డు, పొడి చర్మం కోసం ఉపయోగకరంగా ఉంటుంది.

దీనిని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. చర్మం మృదువుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.