గ్లాస్ లాంటి చర్మం కావాలని అందరికీ ఉంటుంది. ఇది సాధించేందుకు బాదం నూనె బాగా పనిచేస్తుందట.

బాదం నూనె తేనెతో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మెరుపులీనుతుంది.

బాదం నూనె పెరుగుతో కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం బిగుతుగా తయారవుతుంది.

పసుపుతో కలిపి బాదం నూనె ప్యాక్ వేసుకుంటే చర్మంలో ఇన్ఫ్లమేషన్ తగ్గి మొటిమల సమస్య తీరుతుంది.

బాదాం నూనెను ఓట్ మీల్ పౌడర్ తో కలిపి మాస్క్ వేసుకుంటే మృతకణాలను తొలగించి చర్మం నునుపుగా, తెల్లగా కనిపిస్తుంది.

ఆలోవెరా జెల్ తో బాదాం నూనె కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం మాయిశ్చరైజ్ అవుతుంది. ఆరోగ్యంగా మెరుస్తుంది.

బాదాం నూనెను నిమ్మరసంతో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే నల్లని మచ్చలు తొలగిపోయి చర్మం అంతా ఒకే రంగులో కనిపిస్తుంది.

అరటి పండు గుజ్జుతో బాదం నూనె కలిపి ప్యాక్ వేసుకుంటే నున్నని యవ్వనవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

Image Source: Pexels and pixabay

ఈ సమాచారం కేవలం అవగాహనకోసమే.