టీ బ్యాగ్ సౌకర్యవంతం కానీ లీఫ్ టీ లో రుచి, గాఢత ఎక్కువ.

టీబ్యాగ్ తయారీకి బ్లీచ్ చేసిన పేపర్ వాడుతారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

టీ ఆకులు వాడి చేసిన టీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ.

నాణ్యత పరంగా చూసినా సరే తేయాకుల్లో పోషకాలు ఎక్కువ.

టీ బ్యాగ్ లతో పోల్చినపుడు విడి ఆకులతో చేసిన టీలో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువ.

విడి ఆకుల తయారిలో ప్రాసెసింగ్ ప్రక్రియ చాలా తక్కువ. ఫలితంగా పోషకాలు నిలిచి ఉంటాయి.

టీ బ్యాగ్ ల తయారీలో తేయాకులు పొడిచెయ్యడం, ముక్కులు చెయ్యడం వల్ల గాలి తగిలి వాటిలో పోషకాలు నష్టపోతాయి.

Image Source: pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.