బ్రోకలీలోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగాలను అందిస్తాయి.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఈ, బెటా కరోటిన్ ఉంటుంది. ఇది కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

సల్ఫోరాఫెన్, ఐసోథియోసైనేట్స్​ ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటాయి.

బ్రోకలీలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.

పొటాషియం కంటెంట్.. శరీరంలోని రక్తపోటు స్థాయిలను అదుపులోకి తెస్తాయి.

జీర్ణ సమస్యలు ఉన్నవారు, మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు బ్రోకలీతో మంచి బెనిఫిట్స్ పొందవచ్చు.

బ్రోకలీలోని ఫైబర్ గట్ హెల్త్​ని మెరుగుపరుస్తుంది. గుడ్ బ్యాక్టీరియాను పెంచుతుంది.

దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

బ్లడ్ షుగర్​ని కంట్రోల్ చేయడంలో, హెల్తీ స్కిన్​ని, బోన్స్​ని ప్రమోట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

సలాడ్స్, సూప్స్ రూపంలో దీనిని రెగ్యులర్​గా డైట్​లో తీసుకోవచ్చు. నిపుణుల సూచలతో తీసుకుంటే మరీ మంచిది.