లిచీలు ఈ సీజన్లో మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ సమయంలో వాటిని రెగ్యూలర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చట. వీటిలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. బీపీ ఉన్నవారు సమస్యను తగ్గించుకునేందుకు వీటిని రెగ్యూలర్‌గా తినొచ్చు. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. గుండె సమస్యలు రాకుండా చేస్తాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి, కె, ఈ, బి పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచి.. జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తాయి. లిచీలు సహజమైన పెయిన్ కిల్లర్స్‌గా పనిచేసి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)