నటి పవిత్ర జయరాం, నటుడు చంద్రకాంత్ లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పవిత్ర ఓ యాక్సిడెంట్లో చనిపోతే.. ఆమె విడిచి ఉండలేక యాక్టర్ చందు సూసైడ్ చేసుకున్నారు. తాము పెళ్లి చేసుకున్నామని చెప్పేలోపే పవిత్ర వెళ్లిపోయిందని చందు తన లాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. చంద్రకాంత్.. పవిత్రతో ఎప్పుడూ పిక్చర్ పోస్ట్ చేసినా.. దానికో ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసేవారు. ఎన్నో సందర్భాల్లో ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ఇన్‌స్టా పోస్ట్‌లు వేసేవారు. పాప నీతో దిగిన లాస్ట్ పిక్ ఇదే.. ఒక్కసారి మామ అని పిలువే ప్లీజ్ అంటూ చందు రాసుకొచ్చారు. Every Painful Story has a Successful Ending అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. ''smile gives more energy in ur work ..keep smiling always and make the people to smile'' అని ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు. Always a supportive Tom @jayaram.pavithra అంటూ మరో ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. We are always a Tom n Jerry ..but finally Tom and Jerry can't live each other a single second ...My Tom అంటూ పవిత్ర గురించి రాశారు.