ఈ ఫుడ్స్ మగవారికి చాలా మంచివట ప్రోటీన్ అందిరికీ అవసరమే. ముఖ్యంగా మగవారికి ఇది కాస్త ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. కొన్ని ఫుడ్స్ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో కలిపి తీసుకుంటే చాలా మంచిదట. ఉడకబెట్టిన గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో మంచి ఫ్యాట్ ఉంటుంది. ప్రోటీన్ పౌడర్‌లో పాలు, అరటిపండు వేసుకుని స్మూతీలో చేసుకోవచ్చు. జిమ్‌కి వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఉడికించిన ఓట్స్‌లో ప్రోటీన్ పౌడర్, బాదం, జీడిపప్పు, అంజీర వంటివి వేసి తీసుకోవచ్చు. చికెన్ సూప్‌లో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. యోగర్ట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. వాటిలో ఫ్రూట్స్ కలిపి తీసుకోవచ్చు. ఇవి మగవారు ఫిట్‌గా ఉండేలా చేయడమే కాకుండా.. మేల్ రీప్రొడెక్షన్ సిస్టమ్‌కి మేలు చేస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)