వేసవిలో కీరదోసను రెగ్యులర్​గా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

కీరదోసలో 96 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి సమ్మర్​లో సూపర్ హైడ్రేషన్​ని అందిస్తుంది.

సమ్మర్​లో శరీరంలో వేడి పెరుగుతుంది. ఆ బాడీ హీట్​ని తగ్గించడంలో కీరదోస హెల్ప్ చేస్తుంది.

కీరదోసను తినడం వల్ల బాడీలో హీట్​ తగ్గి హీట్ స్ట్రోక్ సమస్యలు దూరమవుతాయి.

కీరదోసలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటుంది. ఇవి ఇన్​ఫ్లమేషన్​ని దూరం చేస్తాయి.

కీరదోసలోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.

కీరదోసలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని బరువు తగ్గడం కోసం తీసుకోవచ్చు.

సలాడ్స్​ని సన్నగా కోసుకుని సలాడ్స్​లో తీసుకోవచ్చు. ఈజీగా జీర్ణమయ్యే అవకాశం ఎక్కువ. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది.

నీటిలో ఇన్​ఫ్యూజ్ చేసుకుని తాగితే మంచిది. దానిలో పుదీనాను కూడా వేసుకుని సమ్మర్​ డ్రింక్​గా తీసుకోవచ్చు.

కీరదోసను బాగా కడిగిన తర్వాత తీసుకుంటే మంచిది. ఆర్గానిక్​వి అయితే మరీ మంచిది.