గడ్డ పెరుగు చాలామందికి ఇష్టం. కానీ, ఒక్కోసారి సరిగ్గా తోడుకోదు. పెరుగు చక్కగా, గడ్డ లాగా అవ్వాంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు వాడితే గడ్డ పెరుగు తయారవుతుంది. మీగడ కూడా ఎక్కువగా వస్తుంది. పాలు బాగా మరిగించాలి. తక్కువ మంట మీద మరిగిస్తే మంచిది. పాలు కచ్చితంగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టాలి. అంటే 43 డిగ్రీల వరకు అన్నమాట. స్టార్టర్ గా టేబుల్ స్పూన్ పెరుగును వాడాలి. స్పూన్ పెరుగు వేసిన తర్వాత అది బాగా కలపాలి. అప్పుడే పాలు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. తోడు పెట్టిన తర్వాత దాన్ని వేడి ప్రదేశంలో ఉంచాలి. కచ్చితంగా 6 - 8 గంటలు కదిలించకూడదు. పెరుగు తోడుకున్న తర్వాత.. ఫర్మెంటేషన్ కోసం ఫ్రిజ్ లో ఉంచాలి. Images Credit: Pexels and Free Pik