చైనీయులు చాప్‌స్టిక్స్‌తోనే ఆహారం ఎందుకు తింటారు? చైనా, జపాన్, కొరియా.. ఇక్కడి ప్రజల ఆహార అలవాట్లు చాలా కొత్తగా ఉంటాయి. వీరు ఆహారం తినేందుకు స్పూన్, ఫోర్క్‌లు వాడరు. రెండు పుల్లల(చాప్‌స్టిక్స్)తో కానిచ్చేస్తారు. అలా పుల్లలతో తినడం అంత ఈజీ కాదు. అందుకు చాలా ప్రాక్టీస్ కావాలి. అది ఎంత కష్టమైనా చైనీస్.. పుల్లలతో తినడానికే ఇష్టపడతారు. దాన్నివారు సాంప్రదాయంగా భావిస్తారు. సుమారు 4 వేల ఏళ్ల కిందట జౌ రాజవంశీయులు ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారట. అప్పట్లో చాప్‌స్టిక్స్‌ను వంటగదిలో గరిటెల్లా వాడేవారట. లోతైన పాత్రల్లో ఆహారాన్ని కలిపేందుకు అవి వీలుగా ఉండేవట. ఆహారం తినేందుకు కత్తులు వాడేవారట. కత్తులు ప్రమాదకరం కావడంతో.. పుల్లలతో ఆహారం తినడం ప్రారంభించారు. పుల్లలతో తినేందుకు అనువుగా అక్కడ ఆహారాన్ని తయారు చేస్తారు. ఆ ట్రెండ్ క్రమేనా.. జపాన్, కొరియాలను తాకింది. అక్కడి అన్నం పొడిగా ఉండదు.. ఉండలా అంటుకుంటుంది. అలాగే గోధుమలను నూడుల్స్‌లా తీసుకుంటారు.