వాకింగ్‌కు టైమ్‌ లేదా? జస్ట్ 10 నిమిషాలు ఇలా చేస్తే.. ఎన్నో లాభాలు!

డైలీ కనీసం అరగంట నడిస్తే చాలు.. బోలెడంత ఆరోగ్యం లభిస్తుంది. కానీ, అంత టైమ్ మనకెక్కడిది?

అందుకే, డాక్టర్లు కనీసం 10 నిమిషాలు నడిచినా చాలు బోలెడన్ని బెనిఫిట్స్ ఉంటాయని అంటున్నారు.

10 మినిట్స్ వాకింగ్ వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

నడక వల్ల డోపమైన్ రిలీజ్ అవుతుందని, దానివల్ల మీకు బోలెడంత శక్తి లభిస్తుంది.

కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. బోలు ఎముకల వ్యాధి (osteoporosis) నుంచి నడక కాపాడుతుంది.

10 నిమిషాల నడక జీర్ణక్రియకు సహకరిస్తుంది. గ్యాస్ వంటి సమస్యల నుంచి కూడా కాపాడుతుంది.

నడక వల్ల క్యాలరీలు కరుగుతాయి. దానివల్ల బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

10 నిమిషాల నడక వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. అవి ఒత్తిడి నుంచి దూరం చేస్తాయి.

Image Source: Pexels

డైలీ 10 నిమిషాలు నడిస్తే.. నాణ్యమైన నిద్ర లభిస్తుంది. ఒత్తిడి, యాంగ్జైటీ నుంచి ఉపశమనం దొరుకుతుంది.