హై బీపీ, షుగర్ ఉన్నవాళ్లు తినకూడని 10 ఫుడ్స్

Published by: Geddam Vijaya Madhuri

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం

పికిల్స్, పాపడ్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇవి బీపీని పెంచే ప్రమాదం ఉంది.

వేయించిన ఫుడ్స్

బజ్జీలు, పకోడీలు, ఫ్రైడ్ స్నాక్స్‌లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది కాదు.

తెల్లని బియ్యం

తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది.

షుగర్ డ్రింక్స్

సోడాలు, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి షుగర్ లెవెల్స్ పెంచుతాయి.

స్వీట్స్, డెజర్ట్స్

లడ్డూ, జిలేబి, కేక్, ఐస్‌క్రీమ్ వంటి స్వీట్స్ షుగర్ ఉన్నవాళ్లు ఎక్కువగా తినకూడదు.

ప్రాసెస్డ్ ఫుడ్స్

చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్‌లలో సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఫాస్ట్ ఫుడ్

బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉప్పు, కొవ్వు అధికంగా ఉంటుంది.

రెడ్ మీట్

మటన్, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తినడం గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

బేకరీ పదార్థాలు

బిస్కెట్లు, పేస్ట్రీలు, కుకీస్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర ఎక్కువగా ఉంటాయి.

ఆల్కహాల్, కెఫీన్

ఎక్కువగా ఆల్కహాల్, కాఫీ తీసుకోవడం బీపీ, షుగర్ నియంత్రణను ప్రభావితం చేస్తుంది.