సమ్మర్​లో స్కిన్​ సమస్యలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే కొన్ని టిప్స్​తో వాటిని దూరం చేసుకోవచ్చు.

బయటకు వెళ్లినా.. వెళ్లకున్నా SPF 30 లేదా ఆపై ఎక్కువగా ఉండే సన్​స్క్రీన్​ని కచ్చితంగా అప్లై చేయాలి.

స్కిన్ ఇరిటేషన్​ని తగ్గించుకోవడానికి, పొడిబారడాన్ని దూరం చేసుకోవడానికి నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి.

అలోవెరా జెల్ ముఖానికి అప్లై చేస్తే.. చర్మంపై మంట, ఎర్రదనం తగ్గుతాయి.

సన్​ బాతింగ్ వంటివి, ఎండలో ఎక్కువగా ఉండడం అవాయిడ్ చేయాలి. లేదంటే స్కిన్ క్యాన్సర్ వస్తుంది.

కేవలం ముఖాన్నే కాదు.. పెదాలకు కూడా రక్షణ తీసుకోవాలి. లేదంటే సన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది.

ముఖాన్ని ఎక్స్​ఫోలియేట్ చేయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగుతాయి.

రాత్రుళ్లు పడుకునేముందు కచ్చితంగా ముఖంపై మేకప్ లేకుండా చూసుకోండి.

చల్లని నీటితో ముఖాన్ని కడగడం వల్ల స్కిన్ ఇరిటేషన్, ర్యాష్ తగ్గుతాయి.

ఎండలో బయటకు వెళ్లేప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం, షేడ్స్ పెట్టుకోవడం చేయాలి.