'అల్లం - శొంఠి' ఆరోగ్యానికి ఏది మంచిది



ఎన్నో గొప్ప ఔషధ గుణాలున్న అల్లంని దశాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నారు



మసాలా కూరల దగ్గర నుంచి టీ వరకు అన్నింటిలోనూ అల్లాన్ని ఉపయోగిస్తారు. అల్లం వంటలకి రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది



అయితే తాజా అల్లం కంటే ఎండిన అల్లం ( శొంఠి) పొడి ఆరోగ్యానికి మరింత మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు



శొంఠిపొడి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు ఉన్నవారు తాజా అల్లంతో చేసిన టీ తాగడం కంటే ఎండిన అల్లం పొడి వేసుకుని నీటిని తాగడం వల్ల ఫ్లూ నుంచి త్వరగా కోలుకోవచ్చు



తాజా అల్లం వాతాన్ని పెంచుతుంది. అయితే ఎండిన అల్లం వాతాన్ని సమతుల్యం చేస్తుంది



గ్యాస్, పొట్ట ఉబ్బరం తగ్గించుకోవడం కోసం తాజా అల్లం నమలడం లేదా తాజా అల్లం టీ తాగడానికి బదులుగా అల్లం పొడి వేసుకుని నీటిని తాగితే మంచిది



పరగడపునే గ్లాసు నీటిలో అల్లం పొడి కలుపుకుని తాగడం వల్ల పేగులు శుభ్ర పడతాయి. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది



తాజా అల్లం కఫాన్ని పెంచితే..ఎండిన అల్లం (శొంఠి) జలుబు వల్ల వచ్చే కఫాన్ని పోగొడుతుంది. శ్వాసకోస రుగ్మతలు నయం చెయ్యడంలో బాగా పని చేస్తుంది.



అందుకే తాజా అల్లం కంటే ఎక్కువగా ఎండిన అల్లం పొడి వల్ల ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.



అల్లం కన్నా శొంఠి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా. అందుకే అల్లం ఎండబెట్టి పొడిచేసుకుని ఉపయోగించుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు
Images Credit: Pixabay