సంతృప్త కొవ్వులు, సోడియం ఎక్కువగా కలిగిన ఆహారం గుండెకు చెరుపు చేస్తుంది.

తాజా పండ్లు, కూరగాయలు లేని ఆహారం ఒబెసిటి, బీపీ, గుండె సమస్యలకు కారణం.

ఫిజికల్ యాక్టివిటి తక్కువగా ఉంటే బరువు పెరుగుతారు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిదికాదు.

చురుకుగా ఉండడం అనేది గుండె ఆరోగ్యానికి తప్పని సరి

ప్రతిరోజూ వ్యాయామం చెయ్యడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. కార్డియో వాస్క్యూలార్ సమస్యలుండవు.

పొగతాగడం గుండె ఆరోగ్యానికి చాలా నష్టం చేస్తుంది. బీపీ పెరుగుతుంది. అథెరోస్క్లిరోసిస్ కు కారణం అవుతుంది.

ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే బీపీ పెరుగుతుంది, హార్ట్ ఫేయిల్యూర్ కు దారి తీస్తుంది.

దీర్ఘకాలికంగా ఒత్తిడికి లోనవుతుంటే తప్పకుండా గుండె జబ్బుల బారిన పడతారు.

తగినంత నిద్ర లేకపోతే బరువు పెరిగేందుకు, బీపీకి, గుండె జబ్బులకు కారణం అవుతుంది.

Representational image:Pexels