లాఫింగ్ బుద్ధ... ఈయన ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుందంటారు. మరి రకరకాల రూపాల్లో కనిపించే ఈ బొమ్మల్లో ఏ రూపం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే..



నిల్చున్న లాఫింగ్ బుద్ధ
రెండు చేతులు పైకెత్తి.. వాటిలో బంగారు బంతులు మోస్తూ కనిపించే బుద్ధ ప్రతిమ ఇంట్లో ఉంటే ఆరోగ్యప్రదాతగా భావిస్తారు. ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే దీర్ఘాయుష్షు కలుగుతుందట.



బంగారు నాణేలతో కూర్చున్న లాఫింగ్ బుద్ధ
బంగారు నాణేలతో తిష్టవేసి కూర్చున్న లాఫింగ్‌ బుద్ధా ఇంట్లో ఉంచితే అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట. ఈ ప్రతిమ ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు.. సిరిసంపదలు సమృద్ధిగా కలిగిస్తుందట.



దర్జాగా కూర్చున్న బుద్ధ
డ్రాగన్‌ టార్టాయ్ పై దర్జాగా కూర్చున్న బుద్ద ఇంట్లో ఉంటే.. కెరీర్లో ఊహించని గ్రోత్ ఉంటుందట. ఇలాంటి విగ్రహాన్ని ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు.



పిల్లల్ని ఎత్తుకున్న బుద్ధ
చంటిపిల్లలను ఎత్తుకుని కనిపించే లాఫింగ్ బుద్ధ ప్రతిమ మీ ఇంట్లో ఉంటే ఇంటిల్లపాదీ సుఖ సంతోషంగాలతో ఉంటారట.



క్రిస్టల్ లాఫింగ్ బుద్ధ
క్రిస్టల్‌తో తయారు చేసిన లాఫింగ్‌ బుద్ధా జ్ఞానాన్ని పెంచుతుంది. ఈ ప్రతిమను స్టడీ రూమ్‌లో ఉంచితే దాని నుంచి వచ్చే పాజిటివ్‌ సిగ్నల్స్‌ పిల్లల మనసును ప్రశాంతంగా ఉంచుతుందని నమ్ముతారు.



ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ కింద పెట్టకూడదట. అలా చేస్తే అనర్థాలు జరిగే ప్రమాదం ఉందంటారు ఫెంగ్ షూయ్ నిపుణులు.



ఆఫీసులో, ఇళ్లలో ఎక్కడైనా సరే ద్వార బంధానికి దగ్గర్లో, కానీ ఎదురుగా గానీ సరైన స్ధలాన్ని నిర్ణయించి భూమి కనీసం అడుగున్నర ఎత్తులో ఉంచాలట.



ఈ బొమ్మను ఎవరికి వారు కొనుక్కోకూడదు.. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం.



శతాబ్దం కిందట చైనాలో హొటై పేరుతో బౌద్ధ బిక్షువుగా తిరిగేవాడట లాఫింగ్ బుద్ధ. భుజాన జోలె, చేతిలో బిక్షాప్రాతతో ఉండే ఆయన వద్దకు పిల్లలు వచ్చి ఏమడిగినా జోలె నుంచి తీసిచ్చేవాడట.



జపాన్‌లో లాఫింగ్‌ బుద్ధాను ఏడుగురు అదృష్ట దేవుళ్లలో ఒకరుగా పూజిస్తారు. థాయ్‌లాండ్‌లోనూ భలే క్రేజ్ ఉందండోయ్.



ఎంచక్కా నవ్వే ఈ విగ్రహం ఎక్కడుంటే అక్కడ కష్టాలుండవని..అందుకే శుభకార్యాలకు ఈ బొమ్మను బహుమతిగా ఇస్తుంటారని చెబుతారు.