విడాకులకు దారితీసే ప్రధాన కారణాలు ఇవే



పెళ్లి అనేది ఓ అందమైన అనుభూతి. జీవితాన్ని అల్లుకునే బంధం. ఆ బంధానికి బీటలు వారుతున్నాయి.



ఇటీవలి కాలంలో విడాకుల తీసుకునే రేటు చాలా పెరిగింది. విడాకులకు దారి తీస్తున్న సాధారణ కారణాలను ఓ సర్వే ద్వారా తెలుసుకున్నారు.



భార్యాభర్తల మధ్య జరిగే చాలా తగాదాలకు కారణం మిస్‌కమ్యూనికేషన్. కుటుంబ సమస్యలు, ఆర్ధిక భారాలు ఇద్దరూ కూర్చుని చర్చించుకుంటూ ఉండాలి.



జీవితంలో ఏ బంధం నిలబడాలన్న నమ్మకం చాలా ముఖ్యం. ఒక్కసారి నమ్మకద్రోహం జరిగినా వివాహబంధం నిలబడడం కష్టమే అవుతుంది. అందుకే ఏ విషయాన్నైనా జీవితభాగస్వామితో పంచుకోండి.



వ్యసనాలు కలిగిన వ్యక్తిని ఏ జీవిత భాగస్వామి అంగీకరించలేదు. ఆల్కహాల్, డ్రగ్స్ వినియోగం ఉన్న వారికి విడాకులు తప్పవు.



మహిళలు గృహహింస కారణంగానే ప్రధానంగా విడాకులు కోరుకుంటున్నారు. మానసికంగా, శారీరకంగా పెట్టే హింస... భర్తపై విరక్తిని పెంచుతుంది.



జంటల జీవితాల్లోకి వారి కుటుంబ సభ్యులు తొంగి చూడడం, ప్రతి దానికి కల్పించుకోవడం ఎక్కువవుతున్న కొద్దీ భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూ వస్తుంది.



మీ జీవితభాగస్వామి, మీ పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మిగతా వాళ్ల మాటలకు మీరు లొంగడం మొదలుపెడితే మీ చిన్నకుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది.