సౌత్ ఇండియాకు చెందిన ఈ బ్యూటీ దాదాపు పదిహేనేళ్లుగా బాలీవుడ్ ను ఏలుతోంది. తన నటనతో, అందంతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకొని తిరుగులేని ఇమేజ్ ను దక్కించుకుంది. పెళ్లైన తరువాత ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గుతాయేమో అనుకుంటే.. క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోడీగా భారీ బడ్జెట్ సినిమా 'ప్రాజెక్ట్ K'లో నటిస్తోంది దీపికా. ఇప్పటివరకు బాలీవుడ్ కి పరిమితమైన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రభాస్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ బ్యూటీ ఈరోజు తన 36వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు భారీ ఎత్తున దీపికాను పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. దీపికా ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని.. తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తూనే ఉండాలని కోరుకుందాం!