ఆవలింతలు ఎందుకొస్తాయి? ఆపలేమా? నిద్ర సరిపోక ఆవలింతలు వస్తాయని అనుకుంటారు చాలా మంది. కానీ దానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. ఆవలింతలు పుట్టాక, పెద్దయ్యాక కాదు బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమవుతాయి. ఆవలింతలు ఆగిపోవడమనేది జరుగవు. ప్రతి మనిషికి రోజులో ఏదో ఒక సమయంలో ఆవలింతలు వస్తూనే ఉంటాయి. దీనికి ముఖ్య కారణం ఆక్సిజన్. మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ను తీసుకెళ్లేది రక్తమే. శరీరానికి లేదా మెదడుకు కావాల్సినంత ఆక్సిజన్ అందనప్పుడు ఆవలింతలు అధికంగా వస్తాయి. రాత్రిపూట తక్కువ నిద్రించేవారిలో శరీరానికి ఆక్సిజన్ సరిగా అందదు. వారిలో ఉదయం లేచాక ఆవలింతలు అధికంగా వస్తాయి. మెదడు బాగా పనిచేసి అలసిపోయినప్పుడు కూడా ఆ విషయాన్ని ఆవలింతల రూపంలో మనకు తెలియజేస్తుంది. ఆవలింతలు తీయడం ద్వారా మెదడు కూడా కాస్త రీఫ్రెష్ అవుతుంది. చురుగ్గా మారుతుంది. ఆవలింతలొస్తే చక్కగా నోరు తెరిచి తీసేయండి. మీ మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది.